శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:11 IST)

కోల్‌కతా మొద‌టి మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో కోల్‌కతాకు చెందిన మొద‌టి మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ దేబ‌శ్రీ ఛ‌‌ట‌ర్జీతో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారులు, సిబ్బంది శుక్ర‌వారం మృతి చెందారు. 
 
కోల్‌క‌తా 12వ బెటాలియన్ సీఐ దేబాశ్రీ ఛటర్జీ ఇద్ద‌రు అధికారుల‌తో క‌లిసి ప‌శ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా దద్దూర్ పీఎస్ ప‌రిధిలో హోడ్లాలోని దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో కోల్‌కతాకు వెళ్తున్నారు. 
 
అతివేగంగా కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్.. అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న ఇసుక లారీని ఢీకొట్టాడు. ఈ ప్ర‌మాదంలో దేబాశ్రీ చ‌ట‌ర్జీతో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారులు, ఆమె వ్య‌క్తిగ‌త సెక్యూరిటీ గార్డు త‌ప‌స్ బ‌ర్మ‌న్‌, డ్రైవ‌ర్ మ‌నోజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వారిని స్థానిక ఐబీ స‌ద‌ర్ ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.