బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (18:13 IST)

మరోమారు ఆస్పత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ!

lkadvani
భారతీయ జనతా పార్టీకి చెందిన వృద్ధనేత ఎల్కే.అద్వానీ మంగళవారం మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అద్వానీ అస్వస్థతకు లోనుకావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఇంద్రప్రస్థలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అపోలో న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
కాగా, గత నెలలో అద్వానీ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిదే. రెండు రోజుల పరిశీలనలో ఉంచిన వైద్యులు ఆపై ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇటీవల కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. కాగా, 96 యేళ్ల అద్వానీ ఇటీవలి కాలంలో తరచుగా అనారోగ్యం బారిపడుతున్న విషయం తెల్సిందే.