శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మూడు నెలల తర్వాత స్వదేశానికి వస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్

lalu prasad yadav
బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత సింగపూర్ నుంచి స్వదేశానికి వస్తున్నారు. ఆయనకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆయనను స్వదేశానికి తీసుకొస్తున్నారు. 
 
కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత యేడాది డిసెంబరు నెలలో చికిత్స పొందే నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. ఆయనకు కుమార్తె కిడ్నీ దానం చేయడంతో కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. కుమార్తె రోహిణి ఆచార్య ఈ కిడ్నీని దానం చేశారు. విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తికావడంతో ఆయన అక్కడే కోలుకుంటూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆయన స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనను చూసేందుుక కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకా ఆయన అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.