బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (10:31 IST)

ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారు : నితిన్ గడ్కరీ

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురైన ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. విజయం సాధించినపుడు అంతా తమ గొప్పేనని చెప్పుకునే నాయకులు... ఓడిపోయినపుడు మాత్రం బాధ్యత వహించేందుకు ఎవరూ ముందుకురారని ఆయన కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని ఉద్దేశించి ప్రరోక్షంగా ప్రశ్నించారు. 
 
పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, వైఫల్యాలు, ఓటములకు కూడా నాయకత్వం బాధ్యత వహించాలని అన్నారు. 'విజయానికి ఎంతోమంది తండ్రులు ఉంటారు. కానీ, వైఫల్యం అనాథ. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడతారు. కానీ, ఓడిపోతే మాత్రం, ప్రతి ఒక్కరూ ఇతరులను వేలెత్తి చూపడానికే ప్రయత్నిస్తారు' అని వ్యాఖ్యానించారు. ఓటములు, వైఫల్యాలకు కూడా బాధ్యత తీసుకునే లక్షణం నాయకత్వానికి ఉండాలని వ్యాఖ్యానించారు.