గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (10:42 IST)

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

jagannadh mahaprasadam
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదంలో స్వచ్ఛమైన దేశీయ నెయ్యిని మాత్రమే వినియోగించేలా ప్రధానమంత్రి నరేంద్ర జోక్యం చేసుకోవాలని సురా మహాసురా నిజోగ్ సభ్యులు కోరారు. మహాప్రసాదం పవిత్రతను కాపాడేందుకే ప్రధాని మోడీని జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ మేరకు వారు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. 
 
అలాగే, గౌ రక్షా విధానాలకు అనుగుణంగా, స్వచ్ఛమైన నెయ్యిని స్థిరమైన సరఫరా కోసం గోశాలని స్థాపించాలని వారు ప్రతిపాదించారు. ఇది ఒరిస్సా రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య నుంచి సేకరించిన నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగానికి కూడా వారు విజ్ఞప్తి చేశారు. 
 
"గోశాలను స్థాపించడం వలన మహాప్రసాదం పవిత్రతను కాపాడడమే కాకుండా మీ హృదయానికి ఎంతో ఇష్టమైన 'గౌరక్షా' విధానాలకు అనుగుణంగా, గోవుల మొత్తం సంక్షేమం మరియు అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ చొరవ ఆలయ ఆచారాలకు మద్దతు ఇవ్వడమేకాకుండా 'గౌ-సేవ', సుస్థిరమైన ఆవు అభివృద్ధికి కూడా దోహదపడుతుంది' అని లేఖలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, ఎస్‌జేటీఏ మంగళవారం జరిగిన సమావేశం తర్వాత తశ్రీమందిర్‌లో ఓఎంఎఫ్ఈడీ నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. దాని చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఓఎంఎఫ్ఈడీ ఎండీకి కూడా సభ్యులు లేఖ రాశారు. నెయ్యి సరఫరాకు ప్రత్యేక డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎండీని కోరారు.