సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (17:25 IST)

ఎలాగైనా రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలన్నదే బీఆర్ఎస్ ప్లాన్ : కేవీపీ (Video)

kvp rama
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలన్నదే భారత రాష్ట్ర సమితి నేతల కుట్ర అని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న కూల్చివేతల అంశంలో కేవీపీకి చెందిన ఫామ్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయలేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై కేవీపీ రామచంద్రరావు స్పందించారు. 
 
"నా కుటుంబ సభ్యులకు 111 జీవో  పరిధిలో ఫామ్ హౌస్ ఉన్న మాట వాస్తవమే. కాని అది బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లో లేదు. బీఆర్ఎస్ వాళ్లకు అనుమానం ఉంటే నిపుణులతో వచ్చి మా ఫామ్ హౌస్‌ను తనిఖీ చేసుకోవచ్చు. ఆరోపించడం సులభమే.... .నిరూపించడమే కష్టం. ఫామ్ హౌస్ దగ్గరకు హైడ్రాని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.