శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (18:42 IST)

#mouseplague యంత్రాల ద్వారా ఎలుకల ఏరివేత (video)

ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేయడంతోపాటు పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్న ఎలుకలను పట్టుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో ఎలుకల ద్వారా పంట నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం యంత్రాల ద్వారా ఎలుకల ఏరివేత కార్యక్రమం చేపట్టింది.
 
ఓ రైతు చేసిన విజ్ఞప్తి మేరకు అతడి పొలానికి వెళ్లిన అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైతు పొలంలో ఓ గుంత తవ్వగా వేల సంఖ్యలో ఎలుకలు బయటకు వచ్చాయి. 
 
వాటిని ఓ మిషన్‌లో వేసి దూరంగా తీసుకొచ్చి బయటకు వదిలారు.. ఆలా మిషన్ లోంచి వదిలిన సమయంలో ఎలుకలు వర్షంలా కిందకు పడ్డాయి. మరోవైపు ఆస్ట్రేలియాలో ప్లేగు వ్యాధి ప్రబలుతోంది.. ఇది ఎలుకల వల్లనే వ్యాప్తి చెందుతుంది. దీంతో ఎలుకల నివారణకు ప్రభుత్వం నడుంబిగించింది.
 
ఈ క్రమంలోనే అధికారులు పొలాల వద్ద ఎలుకలను నాశనం చేసే పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌కు చెందిన జర్నలిస్ట్‌ లూసీ థాకరే ట్విటర్‌లో షేర్‌ చేశారు. 'ఎలుకల వర్షం' అంటూ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్‌గా మారింది. 
 
వరి కోత మిషన్‌లాగా ఉన్న యంత్రంలోంచి ఎలుకలు బయట పడుతున్నాయి. ఇక ఎలుకల దెబ్బకు గోదాముల్లోని ధాన్యం పాడైపోతుంది. ఎలుకల సంతతి దేశానికే ప్రమాదంగా మారుతుండటంతో వాటి నివారణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం