మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (16:10 IST)

చిరుత పిల్లను అక్కున చేర్చుకున్న ఓ ఆడ సింహం..

సృష్టిలో అమ్మతనానికి వున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.  అమ్మ ప్రేమలో కల్మషం వుండదు. తాజాగా మూగజీవి కూడా అమ్మతనానికి నిదర్శనంగా నిలిచింది. తాజాగా జాతివైరం ఉన్న ఓ చిరుత పిల్లను తన పిల్లతో సమానంగా చూసుకుంటున్న ఓ ఆడ సింహం తీరు అటవీ అధికారులకు షాక్ నిచ్చింది. 
 
గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఈ అరుదైన దృశ్యాలు కనిపించాయి. గిర్ అడవుల్లో నెలన్నర వయసున్న ఓ చిరుత పిల్లను ఆడ సింహం అక్కున చేర్చుకోవడాన్ని అటవీ అధికారులు గుర్తించారు. తన రెండు పిల్లలతో కలిసి గిర్ పశ్చిమ డివిజన్‌లో ఆడ సింహం సంచరిస్తోంది. చిరుత పిల్ల ఆకలి తీర్చడంతో పాటు ఇతర సింహాలు చిరుత పిల్లను చంపకుండా ఆడ సింహం కాపాడుతోందని గిర్ పశ్చిమ డివిజన్ ఫారెస్ట్ అధికారి ధీరజ్ మిట్టల్ తెలిపారు.