ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (13:08 IST)

ఢిల్లీలో లిక్కర్ డోర్ డెలివరీ

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మద్యాన్ని హోం డెలివరీ చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది.

మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ సాయంతో మద్యం ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే చాలు హోం డెలివరీ చేసేందుకు అనుమతిస్తూ ఢిల్లీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇళ్లతోపాటు హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు పంపిణీ చేయనున్నారు. మద్యం ప్రియుల ఇళ్ల వద్దకే మద్యాన్ని డెలివరీ చేసేందుకు మద్యం వ్యాపారులకు సర్కారు అనుమతించింది. మద్యం హోం డెలివరీపై మద్యపానప్రియులు సంతోషం వ్యక్తం చేశారు.