గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:04 IST)

రేపటి నుంచి బీహార్ లో మళ్ళీ లాక్ డౌన్

కరోనాను నియంత్రించేందుకు సతమతమవుతున్న బీహార్ ప్రభుత్వం.. గత్యంతరం లేని స్థితిలో మళ్లీ లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయించింది. ఈనెల 16వ తేదీ నుంచి 31వ తేదీవరకు లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది.

దీనికి సంబంధించిన సవివరమైన గైడ్‌లైన్స్‌ను కూడా విడుదల చేసింది. నిత్యాసవరాల సరకుల షాపులతో పాటు భవన నిర్మాణం, వ్యవసాయ పనులకు అనుమతినిచ్చింది. ఈ రెండింటికి చెందిన షాపులకు కూడా అనుమతి లభించింది.

బ్యాంకులు, ఎటిఎంలు, బీమా కార్యాలయాలకు అనుమతనిచ్చింది. నిత్యవసర సరుకులు హోం డెలివరికి కూడా అనుమతి నిచ్చింది.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్నీ మూసే ఉంటాయి. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదు. మత ప్రార్ధనా సంస్థలు కూడా మూసే ఉంటాయి.