నేటి రాత్రి నుంచి యూపీలో మళ్ళీ లాక్ డౌన్

yogi adityanath
ఎం| Last Updated: శుక్రవారం, 10 జులై 2020 (10:06 IST)
కొరకరాని కొయ్యలా మారిన కరోనా కోరల నుంచి ప్రజానీకాన్ని దూరంగా వుంచేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి జూలై 13వ తేదీ ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం 1,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినప్పటికీ.. మరణాల రేటు అధికంగా వుండడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. యూపీలో గురువారం కరోనా వల్ల 18 మంది మరణించారు.
దీనిపై మరింత చదవండి :