29 నుంచి లోక్‌సభ సమావేశాలు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 29 నుంచి లోక్‌సభ సమావేశాలు మొదలుకానున్నాయి.
జనవరి 29న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు తొలివిడత సమావేశాలు జరగనున్నాయి.
మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.