శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (15:46 IST)

2024లో చంద్రగ్రహణం ఎపుడు ఏర్పడుతుంది?

blue moon
కాలచక్రంలో 2023 సంవత్సరం ముగిసిపోగా, 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ నెల కూడా దాదాపుగా పూర్తికానుంది. అయితే, కొత్త సంవత్సరంలో చంద్రగ్రహణం ఏర్పుడ ఏర్పడుతుందన్న అంశంపై ఇపుడు చర్చ సాగుతుంది. దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. 
 
ఈ కొత్త యేడాదిలో తొలి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన సోమవారం ఏర్పడనుందని ఖగోళశాస్త్రం చెబుతోంది. చంద్రగ్రహణం ఉదయం 10.41 గంటలకు మొదలై మధ్యాహ్నం 3.01 గంటలకు ముగుస్తుంది. దాదాపు 4 గంటలపాటు కొనసాగనుంది. అదే రోజు హోలీ పండుగ వచ్చింది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇతర అనేక ప్రాంతాల్లో కనువిందు చేయనుంది.
 
ఇక 2024 సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం సెప్టెంబరు నెల 18వ తేదీన సంభవించనుంది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై ఉదయం 10.17 గంటల వరకు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం కూడా భారత్‌లో కనిపించదు. యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా, దక్షిణ, ఉత్తర ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలోని ప్రాంతాల్లో కనిపించనుంది.