ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (21:33 IST)

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. రివాల్వర్‌తో కాల్చుకుని..?

MLA son
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బర్గి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ యాదవ్‌ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో చోటుచేసుకుంది. 
 
గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వైభవ్‌ యాదవ్‌ (17) ఇంట్లోని బాత్‌రూమ్‌లో రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసు అధికారి అలోక్‌ శర్మ తెలిపారు. రివాల్వర్‌ పేలిన శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. బాత్‌రూమ్‌లో గాయంతో పడి ఉన్న వైభవ్‌ యాదవ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.  
 
అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్యకు వైభవ్‌ యాదవ్‌ ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేని అదనపు సూపరింటెండెంట్‌ రోహిత్‌ కేశ్వాని తెలిపారు. 
 
గన్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారని, రికవరీ తర్వాత మాత్రమే దానికి లైసెన్స్‌ ఉందా? లేదా అన్న విషయం తెలుస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో.. ఎమ్మెల్యే దగ్గరికి ఆ పార్టీ నేతలు, పలువురు చేరుకొని సంతాపం తెలుపుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.