మధ్యప్రదేశ్‌లో మార్చి 31వరకు పాఠశాలలు బంద్
దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదు అవుతోంది. కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో 8వ తరగతి వరకూ స్కూళ్లను మార్చి 31 వరకూ తెరవకూడదని నిర్ణయించింది. దీనికితోడు ఈ ఏడాది ఐదవ తరగతి, ఎనిమిదవ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే 9వ తరగతి నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు.