పక్కింటి కుర్రాడిపై మోజు, భర్తకు విడాకులిచ్చి వస్తే షాకిచ్చిన కుర్రాడు
తనకంటే వయస్సులో చిన్నవాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత దారుణంగా మోసపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. ప్రియుడితో కోరికలు తీర్చుకునేందుకు భర్తకు విడాకులిచ్చేసి జీవితాన్ని నాశనం చేసుకుంది.
గ్వాలియర్‌లోని మైదై మొహల్లా నివాసి అయిన ఇరవై ఆరేళ్ళ మహిళకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈమధ్యే తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సపర్యలు చేసేందుకు ఆమె పుట్టింటికి వచ్చింది. అక్కడే ఆమెకు స్థానికంగా ఉన్న బాలుడితో పరిచయం ఏర్పడింది. దీంతో అందరి కళ్లుగప్పి వారిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. తన కంటే వయస్సులో చిన్నవాడితో ఆమె వీలు చిక్కినప్పుడల్లా కోరికలు తీర్చుకుంటూ అతడు లేనిదో బతకలేని స్థితికి చేరుకుంది. భర్తకు విడాకులిస్తే తాను పెళ్లి చేసుకుంటానని బాలుడు ఆమెకు హామీ ఇచ్చాడు.
అతడి మాటలు నమ్మిన మహిళ భర్త చిత్రహింసలు పెడుతున్నాడని ఆరోపిస్తూ న్యాయస్థానం ద్వారా విడాకులు తీసుకుని శాశ్వతంగా పుట్టింటికి వచ్చేసింది. దీంతో వారిద్దరు అడ్డూఅదుపూ లేకుండా కామకలాపాల్లో మునిగి తేలేవారు. ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు తప్పించుకుని తిరిగేవాడు. ఇటీవల గట్టిగా నిలదీయడంతో పెళ్లయిన దానివి, వయస్సులో నాకంటే పెద్దదానివి నిన్నెలా పెళ్లి చేసుకుంటాను అంటూ షాకిచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు గ్వాలియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.