1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (12:48 IST)

శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోంది : సంజయ్ రౌత్

sanjay raut
ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను భారతీయ జనతా పార్టీ బెదిరిస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయంతెల్సిందే. శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. 
 
ఈ పరిణామాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం బీజేపీ అని ఆయన ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందన్నారు. అదేసమయంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తుందని ఆరోపించారు. 
 
మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేల బలం మరింతగా పెరిగింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతు నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 47మంది ఎమ్మెల్యేలు షిండే గూటికి చేరగా, వీరిలో 37 మంది ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తరపున ఉండటం గమనార్హం.