గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (09:22 IST)

పెళ్లి పేరుతో యువతిని వాడుకున్న ఐటీ కమిషనరు .. అత్యాచారం కేసు

మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో ఆదాయపన్ను శాఖ కమిషనరుపై అత్యాచారం కేసు నమోదైంది. పెళ్లి పేరుతో ఓ యువతిని శారీకంగా వాడుకుని మోసం చేశారన్న అభియోగాలతో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ మేరకు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 
 
2019లో నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (ఎన్ఎడీటీ)లో శిక్షణ పొందుతున్న ఐటీ కమిషనర్ పుదుచ్చేరి నివాసి. నిందితుడైన ఐటీ కమిషనర్ వైద్య చికిత్స కోసం నాగపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినపుడు అక్కడ పనిచేస్తున్న మహిళా వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. 
 
యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా డాక్టరుకు నిందితుడైన ఐటీ కమిషనర్ తన మొబైల్ నంబరు ఇచ్చాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. మహిళా వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. నిందితుడు మహిళ అశ్లీల చిత్రాలు కూడా తీశాడు. 
 
మహిళ గర్భందాల్చడంతో గర్భస్రావం చేయించుకోవాలని నిందితుడు కోరాడు. తనను పెళ్లి చేసుకోవాలని బాధిత మహిళ పట్టుబట్టడంతో తన అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు చెప్పారు. 
 
దీంతో పోలీసులు ఐటీ కమిషనరుపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (2) కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడిని బెంగళూరులో పోస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.