మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (13:46 IST)

కుటుంబ కలహాలు... భార్యను పాశవికంగా వేటకొడవలితో నడిరోడ్డుపైనే?

తమిళనాడులో పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త పాశవికంగా హతమార్చాడు. నడిరోడ్డుపైనే వేటకొడవలితో నరికి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుగల్ జిల్లా రాజపాలెంలో చోటుచేసుకుంది.

తమిళనాడులో పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త పాశవికంగా హతమార్చాడు. నడిరోడ్డుపైనే వేటకొడవలితో నరికి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుగల్ జిల్లా రాజపాలెంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డుపై తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో నరికి చంపాడు. వెంటనే కొందరు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చారు. దీంతో, మదీశ్వరన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మరణించింది. ఈ ఘటన గత నెల 20వ తేదీన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని మదీశ్వరన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్‌లో జరిగిన ఈ దారుణం సీసీటీవీలో రికార్డయింది.