గర్భిణీ కడుపును కోసిన కసాయి భర్త.. ఎందుకో తెలుసా?

Pregnant
pregnant
సెల్వి| Last Updated: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:00 IST)
ఏడు నెలల గర్భిణీ కడుపును కోసిన కసాయి భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కడుపులో వున్న శిశువు, ఆడామగా అనేది తెలుసుకునే క్రమంలో గర్భిణీ మహిళ కడుపును కత్తితో కోశాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, నెక్పూర్‌కు చెందిన భన్లాన్ అనే వ్యక్తి.. తనకు ఆరో సంతానంగా అబ్బాయి కావాలనుకున్నాడు. ఐదుగురు అమ్మాయిలకు తండ్రి అయిన ఆ వ్యక్తి తనకు ఆరో సంతానంగా అబ్బాయి పుట్టాలనుకున్నాడు.

ఇక ముందు వెనుక ఆలోచించకుండా.. భార్య గర్భాన్ని కోసి చూసేయాలనుకున్నాడు. అంతే కత్తితో ఆమె కడుపును కోశాడు. స్థానికులు వెంటనే మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ నుండి ఆమెను బరేలీ ఆసుపత్రికి పంపారు.

ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్న బరేలీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి, భర్తను అరెస్టు చేసినట్లు, ఎస్పీ తెలిపాడు. నేరం వెనుక గల కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.దీనిపై మరింత చదవండి :