1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (09:16 IST)

మోడీ నీచుడు.. సభ్యత లేనివాడు... అయ్యర్ :: వేటేసిన కాంగ్రెస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచుడు, సభ్యత లేనివాడు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్‌పై కాంగ్రెస్ యువసారథి రాహుల్ గాంధీ కన్నెర్రజేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచుడు, సభ్యత లేనివాడు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్‌పై కాంగ్రెస్ యువసారథి రాహుల్ గాంధీ కన్నెర్రజేశారు. మణిశంకర్ అయ్యర్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం తొలగించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ఆయన్ని ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేయటంతోపాటు, ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మణిశంకర్‌ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని అయ్యర్‌‌పై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మ్యాచ్‌ కీలక దశకు చేరుకున్న తరుణంలో మోడీని నీచుడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి సెల్ఫ్‌గోల్‌ వేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏమీలేక విలవిల్లాడుతున్న బీజేపీకి ఒక్కసారిగా కాంగ్రెస్‌పై విరుచుకుపడేందుకు అవకాశమిచ్చారు. 
 
అయ్యర్‌ను తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేశారు. అయ్యర్‌ను బీజేపీ చేతిలో పావుగా అభివర్ణించారు. నిజానికి అయ్యర్‌ కాంగ్రెస్‌ ప్రయోజనాలను దెబ్బ తీస్తూ శల్య సారథ్యం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓడితే మోడీ ఏఐసీసీ కార్యాలయం ముందు చాయ్‌ అమ్ముకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించి కాంగ్రెస్‌ అవకాశాలను ఘోరంగా దెబ్బతీశారు. అప్పుడు ఆయన వాచాలతను సోనియా క్షమించినా, ఇప్పుడు పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించిన రాహుల్‌ క్షమించలేదు. పార్టీకి డ్యామేజ్‌ జరుగుతుందని గ్రహించి, క్షణం ఆలస్యం చేయకుండా బహిష్కరించారు.