సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (15:59 IST)

జార్ఖండ్ డుమ్రి పీఎస్ పరిధిలో వంతెనను పేల్చేసిన మావోలు

జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇటీవలికాలంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెనను మందుపాతర ద్వారా పేల్చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 
 
అంతేకాకుండా, ఇదే జిల్లాలో మరో మొబైల్ టవర్‌కు కూడా నిప్పు పెట్టారు. మావోయిస్టు కీలక నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు మావోలు వెల్లడించారు. 
 
మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను గ్రేహౌండ్స్ దళాలు మరింత ముమ్మరం చేశాయి. అలాగే, ఏజెన్సీ గ్రామాలను సైతం పోలీసులు అప్రమత్తం చేశారు.