ఢిల్లీ ఓల్డ్ సీమపురి ప్రాంతంలో అగ్నిప్రమాదం - నలుగురి మృతి
ఢిల్లీలోని ఓల్డ్ సీమపురి ప్రాంతంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంపై అంతస్తులో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ నాలుగు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత నలుగురి మృతదేహాలను గుర్తించారు. అయితే, నలుగురు భారీ పొగకారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు.
మృతుల్లో శాస్త్రిభవన్‌లో ప్యూన్‌గా చేస్తున్న 59 వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మృతులు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, ప్యూన్‌తో పాటు భార్య, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.