1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Mercury plunges across north, northwest India; cold wave conditions expected to prevail for next 2 days

వణికిపోతున్న ఉత్తర భారతం.. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత

cold wave
ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. దీనికి కారణం చలి. దీని ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీనగర్‌లో మాత్రం మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో సగటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 5.3,16.2 డిగ్రీలుగా ఉన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
మరోవైపు, జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ ప్రాంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. దాల్ సరస్సు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకునిపోయింది. ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. మరో రెండు రోజుల పాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. 
తర్వాతి కథనం
బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన బలూచిస్థాన్... పాక్ జవాన్లు మృతి