బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (11:55 IST)

పానీపూరీలను ఇష్టంగా లాగిస్తున్న గజరాజు

elephant
సోషల్ మీడియా పుణ్యమాన్ని ఏ చిన్న సంఘటన కూడా వైరల్ అయిపోతోంది. ఈ వీడియోలు వైరల్ కావడం వల్ల అనేక విషయాల్లో తీసుకునే చర్యలు కూడా వేగంగా జరిగిపోతున్నాయి. తాజాగా ఓ గజరాజు అమిత ఇష్టంతో పానీపూరీలను ఆరగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. 
 
సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. ఫుటేజీలో ఓ పానీపూరీ చాట్‌ బండి వద్ద ఒక ఏనుగు నిలబడి ఉంది. నెమ్మదిగా పానీపూరీలను దుకాణదారుడే ఏనుగుకు పానీపూరి తినిపించాడు. పానీపూరీలు ఒక్కొక్కటిగా ఆరగించేసింది. మళ్లీ మళ్లీ ఏనుగు తొండం చాచి పానీపూరీ తీసుకుంటోంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by