మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జులై 2022 (19:30 IST)

చీకటి గొయ్యిలో పడిపోయిన గున్న ఏనుగు (వీడియో వైరల్)

Elephant
గుంతలో పడిపోయిన ఏనుగు పిల్ల నాలుగు గంటల పాటు కష్టపడి కాపాడారు.. ఫారెస్ట్ సిబ్బంది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఏనుగు పిల్లను పైకి లాగేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించినా వాళ్ల వల్ల కాలేదు. ఒక ఎక్స్‌కవేటర్‌తో పెద్ద గుంత తవ్వారు. అనంతరం ఒక అధికారి చీకటి గొయ్యిలోకి దిగి, అప్పటికే అలసిపోయి పడుకున్న ఏనుగుకు తాడును బిగించాడు. 
 
మిగతా అధికారులు దాన్ని పైకి లాగారు. చివరగా, పిల్ల ఏనుగును దాని కుటుంబంతో కలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.