బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (13:29 IST)

ముంబైలో మెక్సికన్ మహిళా డీజేపై అత్యాచారం

victim woman
ముంబైలో మెక్సికన్ మహిళా డీజేపై అత్యాచారం జరిగింది. ఈ విదేశీ మహిళను లైంగికంగా వేధించిన 36 ఏళ్ల స్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ యజమానిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. స్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మ్యూజిక్ ఈవెంట్ కంపెనీ. 
 
బాధితురాలి కెరీర్‌ను నాశనం చేయాలని నిందితులు ఆమెను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి పేరు ప్రతీక్ పాండే. ప్రతీక్ డ్యాన్స్ మ్యూజిక్ షో నిర్వహిస్తున్నాడు. బాధితురాలు 31 ఏళ్ల మహిళ. పాండే 2020లో వివాహం చేసుకున్నాడు.
 
కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్ - ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్, టుమారోల్యాండ్‌లో బాధితురాలు పలుమార్లు అత్యాచారానికి గురైంది. నిందితుడికి క్రిమినల్ నేపథ్యం ఉందని బాధితురాలి తరపు న్యాయవాది అర్బాజ్ పఠాన్ తెలిపారు. 
 
బాధితురాలు మోడల్ కావడానికి ముంబైకి వచ్చింది. ఉద్యోగం కోసం వచ్చిన ఆమెను లైంగికంగా వేధించాడు. ఆపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇకపోతే.. నిందితులపై అత్యాచారం, అసహజ సెక్స్, క్రిమినల్ బెదిరింపు, లైంగిక వేధింపులు,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ల కింద బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతీక్ పాండేను డిసెంబర్ 2 వరకు కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.