బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (17:58 IST)

ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం

mig 29 war flight
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో మిగ్-29 రకం యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అప్రమత్తమైన పైలట్‌ కిందకు సురక్షితంగా బయటపడ్డారు. విన్యాసాల కోసం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయల్దేరిన ఈ ఫైటర్‌ జెట్‌ ఆగ్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలిన చోట విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 
 
మిగ్‌-29 విమానం ఇలా కుప్పకూలిన ఘటనలు గతంలోనూ జరిగాయి. సెప్టెంబరు 2వ తేదీన రాజస్థాన్‌లోని బార్మేర్‌లో శిక్షణ నేపథ్యంలో మిగ్‌-29 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్‌ ఆ విమానం కూలడానికి ముందే సురక్షితంగా బయటపడ్డారు.