మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (06:30 IST)

నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోదీ సమావేశం కానుండడం ఇది మూడోసారి.

కరోనా వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నారు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో మాట్లాడే అవకాశం ఉంది.

కాగా, కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాలు మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నాయి. దీనిపైనా మోదీ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.