మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:27 IST)

ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్ మార్చిన మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్‌ను మార్చేశారు. ఇవాళ ఉద‌యం జాతిని ఉద్దేశించి మాట్లాడే స‌మ‌యంలో ఆయ‌న త‌న ముఖానికి మాస్క్ తొడుక్కున్నారు.

తెలుపు, న‌లుగు రంగు ఉన్న గ‌మ్‌చాను ఆయ‌న ముఖానికి చుట్టుకున్నారు. అదే పిక్‌ను ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్‌గా అప్‌లోడ్ చేశారు.  లాక్‌డౌన్‌ను దేశ‌వ్యాప్తంగా మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం మోదీ త‌న ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. 

నోవెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి గ‌ట్టెక్కేందుకు ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌న్న సందేశాన్ని ఇచ్చారు. స్కార్ఫ్‌, గ‌మ్‌చా లాంటి మాస్క్‌ల‌ను ఇంట్లోనే ఉన్న సాధార‌ణ వ‌స్త్రంతో త‌యారు చేసుకోవ‌చ్చు.

ఇటీవ‌ల సీఎంల‌తో జ‌రిగిన వీడియోకాన్ఫ‌రెన్స్ స‌మ‌యంలోనూ మోదీ మాస్క్ ధ‌రించిన విష‌యం తెలిసిందే. రెండ‌వ ద‌శ‌లోనూ అత్యంత క‌ఠినంగా లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు త‌న సందేశంలో తెలిపారు.