సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:49 IST)

వయనాడు విలయంలో వానరం.. బిడ్డను హత్తుకుని కాపాడిన వైనం (Video)

monkey
monkey
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ముండుక్కై, చూరల్మలలో జులై 30వ తేదీన ప్రకృతి సృష్టించిన విపత్తు అంత ఇంత కాదు. ఈ విపత్తు కారణంగా వందలాది మంది మరణించారు. ఎంతో మంది గాయపడ్డారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 
 
ఈ విపత్తును ముందే ఓ రామ చిలుక పసిగట్టిందని..రామ చిలుక చేసిన హంగామాతో ఆ ఇంటి యజమానులు ఇళ్లు ఖాళీ చేసి మరో ప్రాంతంలో ఉంటున్న తన సోదరి నంద నివాసానికి వెళ్లిపోయారట.  అలాగే ఇరుగు పొరుగు వారు సైతం తమ తమ ఇళ్లును వదిలి తెలిసిన వారి ఇళ్లకు చేరుకున్నారన్నారు. దీంతో వారంతా ప్రాణాలతో భయటపడ్డారట. 
 
ఇలా ప్రకృతి విలయాన్ని పక్షులు ముందుగానే పసిగడతాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. అలాగే మనిషిలా జంతువులు కూడా తమ పిల్లలను కాపాడేందుకు ముందుంటాయి. ఈ క్రమంలో వయనాడు విలయంలో చిక్కుకున్న తన బిడ్డను ఓ వానరం హక్కున చేర్చుకుని కాపాడింది. ఎవరైనా కాపాడుతారా అన్నట్లు ఆ వానరం అటూ ఇటూ చూస్తూ.. నిలబడేందుకు శక్తి లేకపోయినా తన బిడ్డను గట్టిగా పట్టుకుని కనిపించింది.
 
శరీరం అంతా బురద.. ఆ బురదతో కంటిని తెరవలేని స్థితిలో బిడ్డను కాపాడుతూ కనిపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేరళ రాష్ట్రం వయనాడులో జరిగిన విధ్వంసం తరువాత ఒక కోతి పిల్ల తనకన్నా చిన్న పిల్లను కాపాడుతున్న విధానం చూసైనా మనం మన సాటి మనిషికి ఆపదలో సహాయం చేయాలని తెలుసుకోవాలని రాసుకొచ్చారు.