మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 10 మార్చి 2021 (22:37 IST)

కొత్త కోడలు రావడంతో భర్త చనిపోయాడని వేధింపులు, ఆత్మహత్య

అత్త అంటే అమ్మతో సమానం. ఇంటికి వచ్చిన కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన బాధ్యత అత్తపైన ఉంటుంది. అలాంటి అత్త తన కోడలిని చిన్న కొడుకుకు శారీరక వాంఛ ఇవ్వమంటూ హింసించింది. అందుకు ఒప్పుకోని ఆ అభాగ్యురాలిని అతి దారుణంగా కొట్టింది. దీంతో మనస్థాపానికి గురై ఆ అభాగ్యురాలు..
 
రాజస్థాన్ లోని గంగానగర్ ప్రాంతానికి చెందిన పల్లవికి గత సంవత్సరం మేనెలలో అన్సుల్ చబ్రా అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.  ప్రస్తుతం పల్లవి ఐదునెలల గర్భిణి. పెళ్ళయిన ఐదునెలలకే ఆమె మామ అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి పల్లవికి అత్త ఇంట్లో టార్చర్ ప్రారంభమైంది.
 
పల్లవితో వివాహం జరగడం వల్లనే తన భర్త చనిపోయాడంటూ అత్త గొడవకు దిగేది. ప్రతిరోజు ఆమెతో ఏదో విధంగా గొడవ పడుతూ ఉండేదట. ఎలాగైనా ఇంటి నుంచి పల్లవిని పంపించేయాలని ప్లాన్ చేసింది. ఏకంగా తన చిన్న కుమారుడుతో లింక్ పెట్టి మాట్లాడటం మొదలుపెట్టింది.
 
అన్సుల్ చబ్రా ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లిన వెంటనే రోజూ ఇదే టార్చర్. ఇదే విషయాన్ని పల్లవి తన తల్లికి కూడా చెప్పిందట. కాస్త సర్దుకుపో.. ఎలాగూ నిన్ను డెలివరీకి పంపిస్తారని తల్లి చెప్పి సముదాయించింది. ఇంకో రెండు నెలల్లో పుట్టింటికి వెళదామనుకున్న పల్లవి చివరకు వేధింపులు ఎక్కువవడంతో ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలు మొత్తాన్ని పూసగుచ్చినట్లు సూసైడ్ లేఖలో రాసింది పల్లవి.