శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (18:56 IST)

'అమ్మ' భాషంటే అలుసా?

ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది మాట్లాడే అతి మధురమైన తెలుగు భాషకు స్వంత రాష్ట్రంలోనే ఇబ్బందులు ఎదురు కావడం విచారకరమని ప్రవాసాంధ్ర ప్రముఖులు వాపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1 నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం తెలుగుభాష మనుగడకు శరాఘాతమని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డా.ఎ.రాధాకృష్ణరాజు వాపోయారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలోనే చదువుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని కీర్తింపబడిన తెలుగుభాషపట్ల అలసత్వం ప్రదర్శంచడం సరైన విధానం కాదని కర్ణాటకలోని తెలుగు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం తెలుగుభాష మనుగడకు శరాఘాతమని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఏ రాధాకృష్ణరాజు వాపోయారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రాథమిక విద్య మొత్తం తమ మాతృభాషలోనే చదువుకునే అవకాశాన్ని విద్యార్ధులకు కల్పించాలని రాజ్యాంగం కల్పించిన ఈ మాతృభాష ప్రాథమిక హక్కును సుప్రీంకోర్టు సైతం అంగీకరించిన సంగతిని ఆయన గుర్తుచేశారు.
 
గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ సొగసైన తెలుగు భాష ప్రజల నోళ్లలో నానుతోందని ఈ తెలుగు భాషా వైభవాన్ని భావితరాలకు పదిలంగా అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ప్రాథమిక విద్యారంగంలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం పునఃపరిశీలించాలని విజ్ఞప్తిచేస్తూ ప్రవాసాంధ్రుల తరుపున, సమితి తరుపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లేఖ రాయనున్నట్లు రాజు వెల్లడించారు.

మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలన్న జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలను ఉటంకించిన ఆయన ఆంగ్లభాషను నేర్చుకోవడం మంచి దయినా తెలుగు భాష ఉనికికే ప్రమాదం ఏర్పడేలా నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.
 
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయండి - ఆర్వీఎస్‌ సుందరం
మాతృభాషలో ప్రాథమిక విద్య నుంచి విద్యార్థులను వంచితుల్ని చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం ఆమోదించలేమని ప్రముఖ తెలుగు సాహితీవేత్త ఆర్వీఎస్‌ సుందరం పేర్కొన్నారు.

మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయాలని ఏపీలోని తెలుగు భాషా సంరక్షకులకు విజ్ఞప్తిచేశారు.
 
గొడ్డలిపెట్టులాంటిదే....
విద్యాసంస్థలలో తెలుగు మీడియం కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం తెలుగు భాష మనుగడకు గొడ్డలిపెట్టులాంటిదని బెంగళూరు అంబేద్కర్‌ తెలుగు సంఘం అభిప్రాయపడింది. సంస్థ ప్రధాన కార్యదర్శి కేఎన్‌ నరసింహమూర్తి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గతంలో తెలుగు భాషా సంరక్షణ కోసం పలు పోరాటాలు చేశారని ఇప్పుడు ఆయన మౌనంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.