శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (12:47 IST)

మనాలిలో మంచు వర్షం..

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లు మంచుదుప్పటి కప్పుకున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న హిమపాతంతో.. ఉత్తర కాశీ, మనాలి ప్రాంతాలు శ్వేతవర్ణాన్ని అద్దుకున్నాయి. లోయలోని ఏ ప్రాంతం చూసినా మంచే కనిపిస్తోంది. దీంతో ప‌ర్యాట‌కుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. మంచు ముద్దల్లో సరదాగా గడుపుతూ.. మనాలి అందాలు చూసి పర్యాటకులు మైమరిచిపోతున్నారు.
 
మనాలి మొత్తం మంచు వర్షంలో మునిగిపోయింది. మంచు దుప్పటిలో ఉంది. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులో జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చెప్పనక్కర్లేదు. జనాలు బయటికి రావాలంటేనే దడుసుకుంటారు. ఇకపోతే.. కురుస్తున్న మంచు వర్షంతో అక్కడి ప్రాంతాలన్నీ కనువిందుగా మారాయి.