శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (09:39 IST)

ఆగస్టులో సినిమా థియేటర్లు ప్రారంభం?

దేశవ్యాప్తంగా థియేటర్లు ఆగస్టులో పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. సినిమా హాళ్లను ఆగస్టు నెలలో తిరిగి ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా సిఫారసు చేసింది. 
 
సినిమా హాళ్ల పునః ప్రారంభంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని ఐబీ కార్యదర్శి అమిత్ ఖరీ చెప్పారు.
 
ఆగస్టు 1వ తేదీ లేదా ఆగస్టు 31వ తేదీన దేశంలోని అన్ని నగరాల్లోని సినిమా హాళ్లను పునః ప్రారంభించాలని తాము సిఫారసు చేశామని ఆయన వెల్లడించారు.
 
సినిమాహాళ్లలో ఆల్టర్నేట్ సీట్లలో ప్రేక్షకులు కూర్చునేలా చేయాలన్నారు. ఇక మధ్యలో ఒక వరుసను ఖాళీ ఉంచాలన్నారు. అయితే కేవలం 25 శాతం ప్రేక్షకులతో థియేటర్లను నడపలేమని సినిమా ఓనర్లు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
అయితే దీనిపై ఇంకా చర్చలు జరిగే అవకాశం ఉంది. కాగా, కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతబడ్డ సంగతి తెలిసిందే.