గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (14:49 IST)

ఒసేయ్... మేం మద్యం తాగితే మీకెందుకే... ఖాకీలకు చుక్కలు చూపిన అమ్మాయిలు...

పీకల వరకు మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. తమను వారించేందుకు వచ్చినందుకు పోలీసులపై వారు చేయి చేసుకున్నారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

పీకల వరకు మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. తమను వారించేందుకు వచ్చినందుకు పోలీసులపై వారు చేయి చేసుకున్నారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై, భయాండర్‌లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్ మహిళా పోలీసులకు వారు కనిపించారు. పైగా, ఆ నలుగురు అమ్మాయిలు ఒకరికొకరు గొడవ పడుతున్నారు.
 
దీంతో పోలీసులు గొడవ పడుతున్న యువతులను అదుపు చేయబోయారు. కానీ, ఖాకీల మాటలేవి పట్టించుకోకుండా పోలీసులపై దాడికి దిగారు. లాఠీలను లాక్కోవడానికి ప్రయత్నించారు. మిగతా ఇద్దరు పోలీసుల షర్ట్ బటన్లు లాగుతూ.. వారి బ్యాడ్జీలను లాగేందుకు యత్నించారు. ఈ నలుగురు యువతులు.. పోలీసులను అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. 
 
మొత్తానికి నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ యువతి తప్పించుకుంది. మిగతా ముగ్గురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నలుగురు అమ్మాయిలను మమతా మెహార్(25), అలీషా పిైళ్లె(23), కమల్ శ్రీవాత్సవ(22), జెస్సీ డీ కోస్టా(22)లుగా గుర్తించారు. డీ కోస్టా పరారీలో ఉంది. ఈ అమ్మాయిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.