సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (07:38 IST)

ప్రజల గొప్పతనాన్ని దేశం ముందు చాటుతున్న మన్ కీ బాత్

ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న రేడియో ప్రసంగాల కార్యక్రమం మన్ కీ బాత్ -మనసులో మాట- ఆయనకు పేరు తెస్తోందో లేదో గానీ దేశం నలుమూలలా సాధారణ ప్రజలు తమ కోసం తాము చేసుకుంటున్న శ్రమల గొప్పతనాన్ని మాత్రం ప్రపంచానికి ప్రతి నెలా చాటుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్ర

ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న రేడియో ప్రసంగాల కార్యక్రమం మన్ కీ బాత్ -మనసులో మాట- ఆయనకు పేరు తెస్తోందో లేదో గానీ దేశం నలుమూలలా సాధారణ ప్రజలు తమ కోసం తాము చేసుకుంటున్న శ్రమల గొప్పతనాన్ని మాత్రం ప్రపంచానికి  ప్రతి నెలా చాటుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ప్రజల స్వార్థ రహిత కృషికి సంబంధించిన విశేష ఘటనలను ప్రధాని కార్యాలయానికి తెప్పించుకుని వాటిని మోదీ తన రేడియో ప్రసంగంలో ప్రస్తావిస్తుండటంతో ఆయా ప్రాంతాలు ఒక్కసారిగా జాతీయ వార్తలై కూచుంటున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ప్రధాని ప్రసంగంలో వార్తై నిలిచింది.
 


ప్రతి నెలా రేడియోలో ప్రసారమయ్యే ‘మన్‌కీ బాత్‌’ లో భాగంగా మోదీ మాట్లాడుతూ మదురై మహిళల సాధికారత, మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్వచ్చందంగా చేపట్టి అపూర్వ విజయాలు సాధించిన వైనాన్ని ప్రస్తావించారు. ‘గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ప్లేస్‌’ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా వస్తువులు అమ్ముతున్నా నంటూ తమిళనాడు మదురైకి చెందిన ఓ మహిళ రాసిన ఉత్తరాన్ని ప్రధాని ప్రస్తావించారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని, ఆమె నుంచి ప్రధాని కార్యాల యం కూడా రెండు వస్తువులు కొనుగోలు చేసిందని మోదీ చెప్పారు.
 
ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంలా మారిందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయ నగరం జిల్లాను ఉదహరించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జిల్లా యంత్రాంగం జిల్లాలోని 71 గ్రామాల్లో 100 గంటలు నిర్విరామంగా శ్రమించి 10 వేల మరుగు దొడ్లను నిర్మించారని ప్రశంసించారు. గత మార్చి 10 ఉదయం 6 గంటలకు ఈ మిషన్‌ను ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేశారన్నారు. వీటి నిర్మాణం వల్ల 71 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయన్నారు. 
 
అలాగే... ముస్లింల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్‌ బిజనౌర్‌ జిల్లాలో 3,500 కుటుంబాలున్న ముబారక్‌పూర్‌ గ్రామ ప్రజలంతా కలసి రంజాన్‌ సందర్భంగా మరుగుదొడ్డి నిర్మించారని మోదీ కొనియాడారు. దీనికి కేంద్రం రూ.17 లక్షలు మంజూరు చేసింద న్నారు. అయితే వారు ఆ డబ్బంతా ప్రభుత్వానికి తిరిగిచ్చేశారన్నారు.