శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (11:54 IST)

రాష్ట్ర ప్రభుత్వాలకు షాకిచ్చిన కేంద్రం: జాతీయ హోదా లభించినా..?

కేంద్ర పభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు షాకిచ్చింది. ఇకపై దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం మాత్రమే నిధులు వస్తాయని తేల్చి చెప్పేసింది. మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
 
అంతేకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చుచేస్తేనే… కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.
 
కాగా ఇప్పటివరకు జాతీయ హోదా లభించిన సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు సమకూర్చేది. ఇకపై కేంద్రం వాటా 60 శాతానికి తగ్గిపోవడమే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రాలు పొందే నిధుల ప్రక్రియ సైతం మరింత క్లిష్టంగా మారనుంది.