శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జూన్ 2023 (22:15 IST)

శోభనం గదిలో గుండెపోటుతో మృతి చెందిన నవ దంపతులు

marriage
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. శోభనం గదిలోకి వచ్చిన నవ దంపతులు తెల్లారేసరికి గుండెపోటు కారణంగా విగతజీవులయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బహ్రైచ్ జిల్లాకు చెందిన 22 యేళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 యేళ్ల పుష్పతో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ పడక గదిలోకి వెళ్లారు. తీరా తెల్లారి చూసే సరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడివున్నారు. 
 
దీనిపై పెళ్లింటివారు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో వారిద్దరూ గుండెపోటుతో మరణించినట్టు తేలింది. మరోవైపు, ఈ దంపతులిద్దరికీ దహన సంస్కారాలు ఒక్కచోటే నిర్వహించారు. ఈ ఘటన గత నెల 30వ తేదీన జరిగింది.