ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (13:39 IST)

నిఫా వైరస్‌ కరోనా కంటే డేంజర్‌- ఐసీఎంఆర్ వార్నింగ్

nipah virus
కరోనా కంటే నిఫా డేంజర్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరించింది. మరణాల సంఖ్య 40 నుంచి 70 శాతం వరకు నమోదు కావొచ్చని చెప్తోంది. తప్పకుండా ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నొక్కి చెప్తోంది. 
 
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని.. సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో... కరోనా కంటే ఇంకా డేంజర్‌ అయిన నిఫా వైరస్‌ భారత్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కోజికోడ్‌లో సెప్టెంబర్ 12 నంచి నిఫా వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కేరళలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని  భావిస్తున్నారు. కేరళలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని  భావిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.
 
కోవిడ్ మరణాలతో పోలిస్తే నిఫా వైరస్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ వల్ల 2 నుంచి 3 శాతం మరణాలు సంభవిస్తే.. నిఫా వైరస్  వల్ల 40 నుంచి 70 శాతం మరణాలు నమోదవుతాయని  ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ డాక్టర్ చెప్పారు.