సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (16:59 IST)

టీషర్ట్, జీన్స్‌ వద్దు..స్టాఫ్ కచ్చితంగా ఫార్మల్‌ దుస్తులు ధరించాల్సిందే..!

సీబీఐ డైరెక్టర్‌గా గతవారం నియమితులైన సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ పరిపాలనా విభాగంలో కొన్ని మార్పులకు చేపట్టారు. ఇకపై సీబీఐ అధికారులు, స్టాఫ్‌ సభ్యులు టీషర్ట్, జీన్స్‌, స్పోర్ట్‌ షూస్‌ ధరించి కార్యాలయానికి వస్తే సహించేదిలేదని సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ హెచ్చరించారు. స్టాఫ్ కచ్చితంగా ఫార్మల్‌ దుస్తులు, బూట్లు ధరించే హాజరు కావాలని ఆయన తెలిపారు. 
 
అంతేకాదు.. గెడ్డం ఉండకుండా క్లీన్‌షేవ్‌ చేసుకుని రావాలని జైస్వాల్‌ సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఐ కార్యాలయాలు, శాఖలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. గతంలో ఎలాంటి డ్రెస్‌కోడ్‌ లేకపోవడంతో టీషర్ట్, జీన్స్‌ ధరించేవారు. దీన్ని ఎవరూ ఆపలేదు. 
 
ఇకపై సూచించిన విధంగా తప్పక పాటించాలి అని మార్గదర్శకాలను వివరించారు. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌కుమార్‌ గతవారమే ఆయన సీబీఐ 33వ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు.