సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (16:11 IST)

వండలూరు జూలో మగ సింహం కరోనాతో మరణించిందా?

తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారులోని వండలూరు జూలో సింహం కరోనాతో మరణించిందని జూ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మనుషుల ప్రాణాలనే తీసిన కరోనా మహమ్మారి ఇప్పుడు జంతువులకు కూడా వ్యాపించి వాటిని కూడా బలి తీసుకుంటున్నాయి.
 
జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన సింహం నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీసెస్‌కు పంపించినట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ అని సంస్థ ఇచ్చిన రిపోర్టు తేల్చిందని వెల్లడించారు. సింహం నుండి ఒక నమూనాను భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపారు. ఇది కరోనా వైరస్‌కు  సానుకూలంగా ఉందని జూ అధికారులు తెలిపారు.
 
వారం రోజుల క్రితం జూలోని మగ సింహం అస్వస్థతకు గురైంది. దీంతో కరోనా సోకిందనే అనుమానంతో దాని నమూనాలను భోపాల్‌లోని సంస్థకు పంపించారు. మరికొన్ని సింహాల నమూనాలు కూడా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో సింహాలకు కరోనా సోకిందా? లేక ఇంకేదైనా వ్యాధి బారిన పడ్డాయా? అనేదాన్ని తేల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, ఇది తప్పుడు పాజిటివ్ కావచ్చు. అనారోగ్యం కారణంగా సింహం చనిపోయివుండవచ్చునని.. రెండో నమూనాను పంపలేదని జూ అధికారి తెలిపారు.
 
కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్‌డౌన్ ప్రకటించిననాటి నుంచీ ఈ జూ మూసివేశారు. కాగా, మే నెలలో హైదరాబాద్ జూలోని ఎనిమిది సింహాలు కరోనా బారినపడటం గమనార్హం. కరోనా మనుషుల నుంచి జంతువులకు వ్యాప్తి చెందుతోందని, అయితే, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందా? అనేదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.