కరోనా కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వర పుణ్యక్షేత్రం!
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒకటి.
ఈ జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ అమలుతో కేసులు కొద్దిగా అదుపులోకి వచ్చినప్పటికీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికంగా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో గ్రామాన్నికంటైన్మెంట్ జోనుగా ప్రకటించారు. కాళేశ్వరం వచ్చే వాహనాలను మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ వద్ద నుండి వెనక్కి పుంపిస్తున్నారు. కాలేశ్వరం ఆలయానికి కూడా భక్తులను అనుమతించడం లేదు.
మహదేవపూర్ మండలం బొమ్మ పూర్ క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాళేశ్వరం ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో, కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా కేసులు తగ్గే వరకు కాళేశ్వరం ఆలయానికి భక్తులెవరూ రావొద్దని పోలీసులు సూచించారు.