రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఆంక్షలు వద్దు : కేంద్ర ప్రభుత్వం
కరోనా కారణంగా ఏపీకి రాకపోకలు సాగించడంలో ఇబ్బంది పడేవారికి శుభవార్త! ఇక మీదట ఈ పాస్ పేరుతో ఎలాంటి ఆంక్షలు పెట్టరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల మధ్య ఆంక్షలు ఉన్నట్లు తమ దృష్టికొచ్చిందని, అలాంటి ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి దెబ్బతింటుందని లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేశారు. సరుకు రవాణా, వ్యక్తుల రాకపోకలకు అనుమతుల అవసరం లేకుండా చేయాలని సూచించారు. సరిహద్దుల్లో ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.