గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (15:08 IST)

ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక - నామినేషన్ల ప్రక్రియ షురూ

venkaiah naidu
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక, ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఇందులోభాగంగా, ఉపరాష్ట్రపతి పదవికి కోసం పోటీపడే అభ్యర్థులు మంగళవారం నుంచే నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 
 
ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీకాలం వచ్చే నెల పదో తేదీతో ముగియనుంది. అందుకోసం నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 19వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. జూలై 20వ తేదీన నామినేషన్ల పత్రాల పరిశీలన ఉంటుంది. 
 
నామినేషన్ల ఉపసంహరణకు జూలై 22వ తేదీ తుది గడువు. ఆగస్టు 6న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. మరోవైపు, ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫలితాన్ని 22వ తేదీన వెల్లడిస్తారు. 
 
ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలతో పాటు మరికొందరు అభ్యర్థులు బరిలో ఉన్నారు.