గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (17:13 IST)

చనిపోయిన అక్క పిలుస్తుందని.. సోదరి కిరోసిన్ పోసుకుని..?

అక్క (చనిపోయిన సోదరి) తనను పిలుస్తుందని.. ఆమె వుంటోన్న స్వర్గానికి రమ్మంటోందని ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మ

అక్క (చనిపోయిన సోదరి) తనను పిలుస్తుందని.. ఆమె వుంటోన్న స్వర్గానికి రమ్మంటోందని ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. వీరిలో జ్యోతి అనే మహిళకు ఇద్దరు సంతానం. 
 
జ్యోతి కొన్ని సమస్యల వల్ల గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి ఆమె చెల్లెలు ఆకాంక్ష జ్యోతి సంతానం బాగోగులు చూసుకుంటోంది. కానీ ప్రతి రోజు తన అక్క జ్యోతి కలలోకి వస్తోందని.. తనను స్వర్గానికి రమ్మని పిలుస్తోందని ఆకాంక్ష అంటూ ఉండేది. 
 
చివరికి ఆకాంక్ష ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆకాంక్ష చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.