మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (11:39 IST)

ప్రామిస్ టూత్‌పేస్ట్ ఆ నవ్వుల్ని తీసుకొస్తాయా?: ప్రకాష్ రాజ్ ప్రశ్న

2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైందని నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు విసిరాడు. ప్రధాని మోదీ బెంగళూరు ర్యాలీపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధిం

2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైందని నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు విసిరాడు. ప్రధాని మోదీ బెంగళూరు ర్యాలీపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బెంగళూరు ర్యాలీలో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ ఆ నవ్వులను తీసుకొస్తాయని మీరు నమ్ముతున్నారా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మోదీపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడే ప్రకాష్ రాజ్.. మోదీ ర్యాలీప ఫైర్ అయ్యారు. 
 
ఇకపోతే.. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.17,000 కోట్లు కేటాయించారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రూపురేఖలు మార్చేది తామేనని మోదీ హామీలు గుప్పించారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర నిధులను దారిమళ్లించి అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు.