శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (14:01 IST)

కాలేజీ స్టూడెంట్‌పై ఆటో డ్రైవర్ అత్యాచారం.. మత్తుమందు కలిపిన నీటిని?

rape
మహారాష్ట్రలో కాలేజీ స్టూడెంట్‌పై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ నర్సింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మత్తు మందు  కలిపిన నీళ్లు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 24న జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
రత్నగిరిలో ఓ నర్సింగ్ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి ఆటోలో బయలుదేరింది. ఆమెతో ఆటో డ్రైవర్ మంచిగా మాటలు కలిపాడు. తాగడానికి నీళ్లు ఇచ్చాడు. అప్పటికే దాహంగా ఉండడంతో ఈ విషయం గుర్తించని విద్యార్థిని ఆ నీళ్లను తాగింది. కాసేపటికే స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన డ్రైవర్.. ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.
 
అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.