బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (16:22 IST)

Nusrat Jahanకు పండంటి బాబు పుట్టాడోచ్

బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కోల్‌కతాలోని నియోతియా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం రాత్రి ఆమె అక్కడ అడ్మిట్ అయ్యారు. 
 
బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. డెలివరీ సమయంలోనూ అతడు అక్కడే ఉన్నాడు. గురువారం ఉదయం కూడా ఆమె హాస్పిటల్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నిఖిల్ జైన్‌తో రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నుస్రత్‌.. 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు.
 
అయితే ఈ ఏడాది మొదట్లో నిఖిల్‌తో తన పెళ్లి ఇండియన్ చట్టాల ప్రకారం చెల్లదని నుస్రత్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. 
 
అంతేకాదు తనకు సంబంధించిన నగలు, వస్తువులను నిఖిల్ అక్రమంగా తన దగ్గరే పెట్టుకున్నాడని, తన అకౌంట్లలోని డబ్బును కూడా తనకు తెలియకుండా వాడుకున్నాడని ఒక ప్రకటనలో ఆమె ఆరోపించారు. గతేడాది నవంబర్ నుంచి ఈ జంట విడిగా ఉంటున్నారు.