ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (15:38 IST)

హోళి వేళ విషాదం : నదిలోకి స్నానానికెళ్లి ఆరుగురు గల్లంతు

హోళీ పండగ వేళ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండగ పూట నదిలోకి స్నానానికెళ్లిన ఆరుగురు బాలురు గల్లంతయ్యాయరు. ఇందులో మూడు మృతదేహాలను వెలికి తీశారు. మరో మూడు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ విషాదకర ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
హోళీ సంబరాల తర్వాత శనివారం ఆరుగురు బాలురు జాజ్‌పూర్‌లోని ఖరస్రోత నదిలో దిగి స్నానం చేస్తున్నారు. ఆసమయంలో ప్రమాదవవశాత్తు ఒకరు నీటిలో మునిగిపోతుండగా.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
 
హోళీ ఆడి నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మునిగిపోతున్న వారిని గమనించి రక్షించడానికి ప్రయత్నించామని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.